ఎల్బీనగర్ బైరామల్ గూడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. హోంమంత్రి, సీఎస్, డీజీపీతో కలిసి వరద ప్రాంతాల్లోని పరిస్థితులను పర్యవేక్షించారు. నీరు త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బైరామల్ గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడిన... కేటీఆర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రికి విన్నవించుకున్నారు.
ఇవీచూడండి: భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం