కాళేశ్వరం జలాలతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దుతామన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భూగర్భ జలాలు ఏడాదిలోనే ఆరు మీటర్ల మేర ఎగబాకాయని ట్వీట్ చేశారు.
కరవు ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీటి పారుదల, వ్యవసాయ రంగాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. జిల్లా మంత్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠ ప్రణాళిక వల్లే సాధ్యమయిందని కొనియాడారు.