రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖులు పెరుగుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా.... ఆయన తనయుడు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో తనకు కరోనా నిర్ధరణ అయిందని ట్విటర్ వేదికగా కేటీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ నిబంధనలు పాటిస్తూ....జాగ్రత్తలు తీసుకోవాలని...అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్