ETV Bharat / city

గల్లీ పార్టీ కావాలా.. దిల్లీ పార్టీ కావాలా: కేటీఆర్​

author img

By

Published : Nov 24, 2020, 7:38 PM IST

Updated : Nov 24, 2020, 7:51 PM IST

మతం పేర రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దని...ప్రశాంత భాగ్యనగరం కావాలంటే మళ్లీ తెరాసకే పట్టం కట్టాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. భాజపాను గెలిపిస్తే పాతబస్తీపై సర్జికల్​ స్ట్రైక్స్​ చేస్తామంటున్నారని... అదేమైనా పాకిస్థాన్​లో​ ఉందా అని ప్రశ్నించారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలోని గాంధీనగర్​ కూడలి, రాంనగర్​ క్రాస్​ రోడ్​ వద్ద రోడ్​ షోలలో పాల్గొని మంత్రి కేటీఆర్​ ప్రసంగించారు.

minister ktr road shows in musheerabad constituency
గల్లీ పార్టీ కావాలా.. దిల్లీ పార్టీ కావాలా: కేటీఆర్​

హైదరాబాద్​లో భాజపాను గెలిపిస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామంటున్నారు...అదేమైనా పాకిస్థాన్‌లో ఉందా అని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ మండిపడ్డారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే ఆపిల్, అమెజాన్, ఫేక్‌బుక్ వంటి బహుళ జాతి కంపెనీలు వస్తాయని.. మన పిల్లలకు కొలువులు దొరుకుతాయని కేటీఆర్ అన్నారు. మతం పేరిట రాజకీయం చేసే వారిని నమ్మవద్దని హితవు పలికారు. గల్లీ పార్టీ కావాలా.. దిల్లీ పార్టీ కావాలా... గుజరాత్ గులాములు కావాలా, హైదరాబాద్ గులాబీలు కావాలా తేల్చుకోవాలని కేటీఆర్ కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ కూడలి, రాంనగర్​ క్రాస్ రోడ్​ వద్ద జరిగిన రోడ్‌ షోలలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 132 కోట్ల మంది భారతీయులను మోసం చేసినందుకు మోదీపై ఛార్జిషీటు వేయాలన్నారు.

దిల్లీ నుంచి వచ్చిన టూరిస్టులు వస్తారు పోతారు... పక్కా లోకల్‌ తెరాస మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే ఆరున్నర లక్షల మందికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేశామన్నారు. ఆ వివరాలను కిషన్‌ రెడ్డికి అందిస్తానని... మోదీని ఒప్పించి ఒక్కొక్కరికి 25వేల రూపాయలు ఇప్పిస్తే దీపాలు వెలిగిస్తాం... గంటలు కొడుతామన్నారు. పదివేలు ఇస్తే ఆపినోళ్లు 25వేలు ఇస్తారా ఆలోచించాలన్నారు. ఎవ్వరూ ఇవ్వరని మళ్లీ మేమే 4వ తేదీ తర్వాత వరద సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: మోదీది బేచో ఇండియా... తమది సోచో ఇండియా: కేటీఆర్​

Last Updated : Nov 24, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.