ETV Bharat / city

హైదరాబాద్‌ దాహార్తికి శాశ్వత పరిష్కారం! - శవాపురం ప్రాజెక్టు

రోజు రోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారంగా కాళేశ్వరం జలాలతో నగర ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవపూర్‌ గ్రామంలో 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రిజర్వాయర్​కి అవసరమైన భూసేకరణ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2050 సంవత్సరం వరకు హైదరాబాద్​కు తాగునీటి కొరత ఉండదని పేర్కొన్నారు.

Minister Ktr Review On Keshapur Reservoir
హైదరాబాద్‌ దాహార్తికి శాశ్వత పరిష్కారం!
author img

By

Published : Oct 6, 2020, 5:12 PM IST

హైదరాబాద్ జంట నగరాల్లో తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కేశవాపురం ప్రాజెక్టు ప్రణాళికలు వేగంగా ముందుకు పోతున్నాయన్నారు. కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన సుమారు 1490 ఎకరాల భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిపారు. జలమండలి కార్యక్రమాలపై ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

శాశ్వత పరిష్కారం!

కేశవాపురం రిజర్వాయర్​కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అటవీశాఖ అనుమతులకు సంబంధించి మరింత వేగంగా ముందుకు పోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని కేటీఆర్ అన్నారు.

సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన

త్వరలోనే కేశవాపురం రిజర్వాయర్​కి ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని... దీనికి అవసరమైన అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్​కి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉందని అధికారులు ఆ దిశగా పనిచేయాలని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్​లో మురుగు నీటి శుద్ధికి మరిన్ని ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీచూడండి: ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.