ETV Bharat / city

Minister KTR France Tour : రామారావు గారూ... బాగున్నారా?

మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ మన భాష తెలిసిన వారి కనిపిస్తే ఎంతో సంతోషపడతాం. కానీ.. ఆ ప్రాంతానికి చెందిన వారు మన భాషలో అనర్గళంగా మాట్లాడితే.. ఇక మన ఆనందానికి అవధులే ఉండవు. అచ్చం అలాంటి పరిస్థితే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు ఎదురైంది. నాలుగు రోజుల ఫ్రాన్స్​ పర్యటన(Minister KTR France Tour )లో ఉన్న కేటీఆర్​ను పారిస్​లోని లక్సెంబర్గ్​ ప్యాలెస్​లో ఓ ఫ్రాన్స్​ జాతీయుడు పలకరించాడు. ఆ పలకరింపు కేటీఆర్​(Telangana IT minister KTR)కు​ ఎంతో హాయినిచ్చింది. అతని మాటలకు ఫిదా అయిన మంత్రి.. తెలంగాణకు వచ్చి కేసీఆర్​ను కలవాలని ఆహ్వానించారు. ఇంతకీ అతడేం మాట్లాడాడంటే..?

Minister KTR France Tour
Minister KTR France Tour
author img

By

Published : Nov 1, 2021, 8:01 AM IST

‘‘రామారావు గారూ బాగున్నారా’’ అంటూ పారిస్‌లోని లక్సెంబర్గ్‌ ప్యాలెస్‌లో ఆదివారం అచ్చమైన తెలుగులో ఆత్మీయ పలకరింపు విని ఆశ్చర్యపోయారు మంత్రి కేటీఆర్‌. అక్కడ తెలుగు వారు ఎవరా అని మంత్రి చూస్తుండగా.. ‘రామారావు గారూ! నేనే మాట్లాడేది’ అంటూ ఒక ఫ్రాన్స్‌ జాతీయుడు ఆయన దగ్గరికి రావడంతో కేటీఆర్‌(Telangana IT minister KTR) విస్మయం చెందారు.

‘‘నా పేరు ప్రొఫెసర్‌ డేనియల్‌ నెగ్గర్స్‌(Telugu professor Daniel Naggers). నాకు చిన్నప్పటి నుంచి తెలుగంటే ఎంతో అభిమానం. పలుమార్లు తెలుగు రాష్ట్రాలను సందర్శించా. మీ భాష నేర్చుకుని ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయంలోని జాతీయ ప్రాచ్య భాషా సంస్కృతుల సంస్థలో దక్షిణాసియా హిమాలయ అధ్యయన విభాగంలో మూడు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నా’’ అని ఆయన వివరించారు.

ఆయన కృషిని మెచ్చుకున్న కేటీఆర్‌(Telangana IT minister KTR).. దాదాపు అరగంట సమయం ఆయనతో మాట్లాడారు. త్వరలో హైదరాబాద్‌ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana Chief Minister KCR)ను కలవాలని ఆహ్వానించారు. పోచంపల్లి శాలువాతో సత్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.