ETV Bharat / city

'ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి.. పాసులు పంపిస్తున్నాం'

author img

By

Published : Apr 17, 2022, 12:53 PM IST

Updated : Apr 17, 2022, 1:20 PM IST

TRS formation day meeting: ఏప్రిల్‌ 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించతలపెట్టిన తెరాస ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పరిశీలించారు. ఏర్పాట్లపై నాయకులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.

minister KTR inspected TRS formation day meeting Arrangements in hicc in hitex

'ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి.. పాసులు పంపిస్తున్నాం..'

TRS formation day meeting: తెరాస ఆవిర్భావ సభను ఏప్రిల్‌ 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించేందుకు అధిష్ఠానం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ సమీక్షించారు. ఎమ్మెల్యే గోపినాథ్​తో కలిసి హైటెక్స్​లోని హెచ్​ఐసీసీలో సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్​.. పలు సూచనలు చేశారు. ఆవిర్భావ వేడుకకు 3000 మంది ప్రతినిధులు హాజరవనున్నారని తెలిపారు. కేవలం ఆహ్వానం అందినవారే సభకు రావాలని సూచించిన కేటీఆర్​.. పాసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

"తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించింది. 21 ఏళ్ల తెరాస.. బాల్యదశ నుంచి మేజర్​గా మారింది. 21వ ఆవిర్భావ వేడుకకు హెచ్​ఐసీసీ వేదికను ఫైనల్ చేశాం. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగలా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం. 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. రేపు మధ్యాహ్నం జీహెచ్​ఎంసీ నాయకులతో సమావేశం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు వార్షికోత్సవంలో ఉంటాయి. ఆహ్వానాలు అందిన వారే ఆవిర్భావ సభకు రావాలి. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుంది. 12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలి. 3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి." - కేటీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

27న ఉదయం 10 గంటలకల్లా పార్టీ ప్రతినిధులందరూ సమావేశ మందిరానికి చేరుకోవాలని అధిష్ఠానం సూచించింది. వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ మేయర్లు, ఛైౖర్మన్లు, మండల పరిషత్తు అధ్యక్షులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు పాల్గొంటారు. ఏప్రిల్‌ 27న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు, ఉదయం 11:05 గంటలకు పార్టీ పతాకావిష్కరణ, కేసీఆర్‌ స్వాగతోపన్యాసం ఉంటాయి. అనంతరం 11 తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించి ఆమోదిస్తారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 17, 2022, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.