Minister KTR: పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ప్రాంతంలో నిర్మించిన 465 రెండు పడక గదుల ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ అందజేశారు. పేదలకు ఇచ్చిన హామీ మేరకు.. రెండు గదుల ఇళ్లు నిర్మించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పేదవర్గాలు ఆత్మగౌరవంగా బతకాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్.. కోట్ల రూపాయలతో ఇళ్లను అందజేస్తున్నారని తెలిపారు.
మంచినీరు, డ్రైనేజీ వసతి కల్పించామని.. లబ్దిదారులంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రులు సూచించారు. లబ్దిదారులు రెండు పడక గదుల ఇళ్లను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 18 వేల కోట్లతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని తెలిపారు.
దేశంలో ఏకైక రాష్ట్రం..
"ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు" అనే సామెత ఉంది. అంటే ఈ రెండు పనులు పేద ప్రజలకు చాలా కష్టసాధ్యమైనవనేది ఆ సామెత ఉద్దేశం. అలాంటిది.. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేయిస్తా.. అనే ఏకైక సీఎం.. కేసీఆర్. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యంతో కేసీఆర్.. ఈ ఇళ్లు కట్టిస్తున్నారు. వీటిని అమ్మడానికి వీల్లేదు. ఇళ్లు రావాడానికి ఎవ్వరికీ.. ఒక్క పైసా ఇవ్వనవసరం లేదు. మన రాష్ట్రంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు.. తమకు కూడా ఇలాంటి సీఎం ఉంటే బాగుండని, ఇలాంటి మంచి పని వాళ్లకు కూడా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు. పేదల కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో అమలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ." - కేటీఆర్, మంత్రి
ఇదీ చూడండి: