ETV Bharat / city

KTR Humanity: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్​.. ఏం చేశారంటే..? - ktr latest news today

మంత్రి కేటీఆర్​.. మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు మీద జరిగిన ప్రమాదాన్ని గమనించి.. కాన్వాయి ఆపి దగ్గరికెళ్లి చూశారు. క్షతగాత్రులను తన ఎస్కార్ట్​ వాహనంలో ఆస్పత్రికి తరలించి.. వాళ్ల ప్రాణాలు కాపాడారు.

minister ktr helped to Wounded who got accident on road

author img

By

Published : Nov 18, 2021, 4:28 AM IST

మంత్రి కేటీఆర్​ మరోసారి తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను కాపాడి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. హైదరాబాద్​లోని అల్వాల్ పోలీస్​స్టేషన్ పరిధిలోని హకీంపేట వద్ద మియాపూర్​కు చెందిన పవన్, నగేష్ అనే ఇద్దరు విద్యార్థులు ద్విచక్రవాహనం మీద శామీర్​పేటలో శుభకార్యానికి హాజరై తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

అదే సమయంలో... మరో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థులను చూశారు. వెంటనే తన కాన్వాయిని పక్కకు నిలిపి కిందికి దిగారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థులను.. తన ఎస్కార్ట్ వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం బొల్లారంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటన విషయంలో తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ మానవతా హృదయానికి సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.