ETV Bharat / city

ప్రజల్ని రెచ్చగొట్టడం సులభం.. కలపడమే కష్టం : కేటీఆర్ - ktr campaign in ghmc elections

వేర్పాటువాద ఎజెండాతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. విభజన రాజకీయాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు.

author img

By

Published : Nov 27, 2020, 7:37 PM IST

హైదరాబాద్​ పేరును భాగ్యనగరంగా మారుస్తామని చెప్పడం.. నేమ్ చేంజర్లు, గేమ్ చేంజర్లు.. ఉద్వేగాలు రెచ్చగొట్టడం సులభం.. కానీ కలపడం కష్టమని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. సరైన అభివృద్ధి ఎజెండా లేకుండా.. కేవలం వేర్పాటువాద ఎజెండాతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. నగరం. రాష్ట్రం శాశ్వతమని.. ఓట్ల కోసం ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టకూడదని హితవు పలికారు.

భాజపాపై మంత్రి కేటీఆర్ విమర్శలు

కర్ణాటక, గుజరాత్​లో వరదలొస్తే వెంటనే నిధులు మంజూరు చేసిన కేంద్రం.. వరద సాయం కోసం తెలంగాణం సీఎంకు లేఖ రాస్తే స్పందించలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అప్పుడు స్పందించని వారు.. ఇప్పుడు బల్దియా ఎన్నికల కోసం గుంపులుగంపులుగా వస్తున్నారని అన్నారు.

పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు రావాలంటే దమ్మున్న లీడర్ కావాలన్న కేటీఆర్.. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.