టీఎస్ బీపాస్‌పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భవన నిర్మాణాల అనుమతిపై అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 21 రోజుల్లోనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. అనుమతి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో దరఖాస్తుదారుడికి చెప్పాలని సూచించారు.
హైదరాబాద్లోని ఎంసీహెచ్‌ఆర్డీలో అదనపు కలెక్టర్లకు పురపాలకచట్టంపై మంత్రి కేటీఆర్ అవగాహన కల్పించారు. అధికారులంతా ఈ-ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ-ఆఫీస్ ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సెక్షన్ల వారీగా రోజు చూసుకోవచ్చని అన్నారు.
ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్