మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్... తాను చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో... ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాత మీటింగ్‌కు బయలుదేరారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్‌తో కూడిన చికెన్ రైస్‌ను తిన్నారు. అనంతరం మరో సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు... కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, మీటింగ్‌కి క్యాబ్‌లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు.
-
More pics 😊
— KTR (@KTRTRS) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Finished the meal and jumped into a yellow cab as we were getting delayed for the next meeting with JnJ pic.twitter.com/EthZlXRcAr
">More pics 😊
— KTR (@KTRTRS) March 26, 2022
Finished the meal and jumped into a yellow cab as we were getting delayed for the next meeting with JnJ pic.twitter.com/EthZlXRcArMore pics 😊
— KTR (@KTRTRS) March 26, 2022
Finished the meal and jumped into a yellow cab as we were getting delayed for the next meeting with JnJ pic.twitter.com/EthZlXRcAr
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్... పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాకాలను వివరిస్తున్నారు.
ఇదీ చదవండి : లైఫ్ సైన్సెస్ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్