ETV Bharat / city

'మీరు వినతులు పట్టించుకోకుండా... మమ్మల్ని నిందిస్తే ఎలా?' - minister ktr latest news

ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి లోక్​సభలో చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్రం అడిగినప్పుడు అవసరమైన సమాచారాన్ని తెలంగాణ సర్కార్​ ఇవ్వలేదని ఐటీశాఖ సహాయ మంత్రి సంజెయ్ ధోత్రే పేర్కొనటాన్ని కేటీఆర్ ఖండించారు.

minister ktr condemned on itir project
minister ktr condemned on itir project
author img

By

Published : Feb 11, 2021, 10:32 PM IST

హైదరాబాద్​లో రూ.3 వేల 275 కోట్ల కేంద్ర నిధులతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్ రీజియన్- ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి 2013 నవంబర్ 13న కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం, సహకారం లోపం ఎత్తిచూపుతూ ఈ ప్రాజెక్టును కొనసాగించకూడదనే నిర్ణయాన్ని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెలిబుచ్చారు. ఈ విధానాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తారా...?

కేంద్రం అడిగిన సమాచారంతో పాటు... అవసరమైన డీపీఆర్, ప్రాజెక్టు గురించి ఆరేళ్లలో అనేక మార్లు రాష్ట్రం నుంచి కేంద్రానికి వినతులు, అభ్యర్థనలు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయటమే కాక... అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించటం ఎన్డీయే ప్రభుత్వానికి, తెలంగాణ భాజపా నాయకులకు తగదన్నారు.

ఇదీ ఎన్డీయే ప్రభుత్వ నిబద్ధత...

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రిగా తాను పలు మార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు ప్రత్యక్ష, పరోక్ష వినతులు చేస్తూనే ఉన్నామన్నారు. కేంద్రం తమ అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోకుండా... రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోందని దుయ్యబట్టారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సంజయ్ ధోంత్రే పార్లమెంట్​లో చేసిన ప్రకటనను ఖండించారు. ఎన్డీయే ప్రభుత్వ నిబద్ధత, రాష్ట్ర భాజపా నాయకుల బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

ఇదీ చూడండీ: మేయర్​ పీఠాన్ని అధిష్ఠించిన మహిళామణుల గురించి తెలుసా...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.