ETV Bharat / city

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు రాష్ట్రమంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Mar 14, 2021, 8:35 AM IST

Updated : Mar 14, 2021, 11:10 AM IST

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్​లోని షేక్​పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తన ఓటు వేశానని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యావంతులంతా సమర్థులకే ఓటు వేయాలని కోరారు.

మహబూబ్​నగర్​లో రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్​లో పాల్గొనాలని కోరారు. విద్యావంతులు ఓటింగ్​కు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Home Minister Mahmoud Ali exercising his right to vote
ఓటు హక్కు వినియోగించుకున్న హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్ మలక్​పేటలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Niranjan Reddy, the minister who exercised his right to vote
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాలలో ని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే పట్టభద్రుడు సైతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని మంత్రి తెలిపారు.

minister-ktr-and-srinivas-goud-casted-their-graduate-votes
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​లో ఓటు వేశారు.

Last Updated : Mar 14, 2021, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.