ETV Bharat / city

అలా చేస్తే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తాం: కేటీఆర్ - తెలంగాణ నూతన మున్సిపల్ చట్టంపై కలెక్టర్లకు అవగాహన

కలెక్టర్లకు గతంలో పురపాలనతో పెద్దగా సంబంధాలు ఉండేవి కావని... సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన చట్టంతో పరిస్థితులు మారిపోయాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్‌ బీపాస్‌పై పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. 21 రోజుల్లోనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్​లోని ఎంసీహెచ్‌ఆర్డీలో అదనపు కలెక్టర్లకు పురపాలకచట్టంపై మంత్రి అవగాహన కల్పించారు.

ktr
ktr
author img

By

Published : Feb 14, 2020, 11:01 PM IST

పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణప్రగతి, నూతన పురపాలకచట్టంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహిస్తోన్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. పాలనా సంస్కరణల వల్ల తాను ఎప్పుడూ అనుకోని... సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రం అయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కొత్త చట్టంతో పరిస్థితులు మారాయి

కలెక్టర్లకు గతంలో పురపాలనతో పెద్దగా సంబంధాలు ఉండేవి కావని... సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన చట్టంతో పరిస్థితులు మారిపోయాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విషయంలో సీరియస్​గా ఉండి అత్యుత్తమ పట్టణాలను రూపొందించాలని మంత్రి కోరారు. ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే అసాధారణమైన అధికారాన్ని కొత్త చట్టం ద్వారా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కల్పించారని గుర్తు చేశారు. మున్సిపల్ చట్టం అమలులో క్షమించరాని తప్పులు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

75 గజాల్లోపు అనుమతి అవసరం లేదు

పరిశ్రమల అమలు కోసం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్​ను కొందరు కొనియాడుతున్నారని... అదే తరహాలో ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బీపాస్​ను అమలు చేస్తామని అన్నారు. లంచం లేకుండా భవన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని... 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. టీఎస్ బీపాస్, మీ సేవతో పాటు మరో యాప్ తీసుకొస్తున్నామన్నారు. వాటి ద్వారా సులభంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందవచ్చని తెలిపారు.

మాస్టర్ ప్లాన్​ రూపొందించండి

రూపాయికే నల్లా కనెక్షన్ విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండొద్దని... వేసవిలో నీటి కొరత రాకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. నీటి కొరత ఉన్న మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీకి డిజిటల్‌ మ్యాప్‌లు, మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యంపై అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.

ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.