ETV Bharat / city

వంగవీటి రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు: కొడాలి నాని - ఏపీ తాజా వార్తలు

Kodali nani: తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం జగన్​ ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్‌ డీజీకి ఆదేశించారన్నారు.

వంగవీటి రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు: కొడాలి నాని

author img

By

Published : Dec 27, 2021, 10:57 PM IST

kodali nani: వంగవీటి రాధాకు 2ప్లస్‌2 గన్‌మెన్లు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మంత్రి కొడాలి నాని కలిశారు. వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రాధాకు భద్రత కల్పించాలని, రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఇంటెలిజెన్స్ డీజీని సీఎం ఆదేశించారని కొడాలి నాని పేర్కొన్నారు. వైకాపాలోకి వస్తానని రాధా చెప్పలేదని.. తాము రమ్మనలేదని స్పష్టం చేశారు. రాధా వైకాపాలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతామన్నారు. రాధా పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లామని.. అంతకంటే మరేం లేదంటూ నిన్నటి పర్యటన గురించి వ్యాఖ్యానించారు.

"రాధాకు 2ప్లస్‌2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. వైకాపాలోకి వస్తానని రాధా చెప్పలేదు.. మేమూ రమ్మనలేదు. రాధా వైకాపాలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతాం. పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లాం.. అంతకంటే మరేం లేదు" - కొడాలి నాని, ఏపీ మంత్రి

అలాగైతే వారు బడ్డీకొట్టే పెట్టుకుంటారు కదా..?

kodali nani on Movie tickets issue: సినిమా టికెట్ల ధరలపై మాట్లాడుతూ.. గతంలో ఉన్న టికెట్ ధరలే ఇప్పుడున్నాయని.. తాము ఎక్కడా తగ్గించలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. టికెట్ ధర పెంచి దోచుకునేందుకు అవకాశం కల్పించలేదన్నారు. కమిటీ వేసి టికెట్‌ ధర పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎగ్జిబిటర్లకు ఎలాంటి నష్టమూ లేదని పేర్కొన్నారు. కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. బడ్డీ కొట్టు ఆదాయం కూడా థియేటర్‌ యజమానికి రాదంటున్నారని.. అలాగైతే థియేటర్ యజమానులు బడ్డీకొట్టే పెట్టుకుంటారు కదా? అంటూ వ్యాఖ్యానించారు.

భాజపా డిపాజిట్లు తెచ్చుకోవాలి..

kodali nani slams TDP and BJP: వచ్చే ఎన్నికల్లో 10 శాతం సీట్లలో భాజపా డిపాజిట్లు తెచ్చుకోవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. ఓటీఎస్‌పై చంద్రబాబు ఆదేశంతో ఆ పార్టీ నేతలు ధర్నాలు చేసి మమ అనిపించారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో రూ.10 వేలతో స్థలం, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని.. ఇప్పటివరకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు.

వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Vangaveeti Radha Sensational Comments: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో వంగవీటి రంగా విగ్రహాన్ని తెదేపా నేత వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని రాధా ఆరోపించారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రాధా చేసిన వ్యాఖ్యలు.. రాజకీయాల్లో వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.