ఏపీలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరతాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 3 రాజధానులకు ప్రజామోదం ఉందని.. స్థానిక ఎన్నికల్లో వైకాపాకు 85 శాతం ప్రజా మద్దతు రావడమే దీనికి నిదర్శనమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టే మూడు రాజదానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు రాజధానులు కట్టడం మీ తరం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను(nara Lokesh comments on 3 capital cities) మంత్రి ఖండించారు. మూడు రాజధానులు కడతామో లేదో.. మా తరమో కాదో మీరే చూస్తారని సవాల్(minister kannababu fire nara Lokesh comments over 3 capitals) చేశారు.
'ఏపీలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనే తెదేపా భావిస్తోంది. సరైన సమయంలో మిగిలిన ప్రాంతాల ప్రజలు సరైన పాఠాలు చెబుతారు. భాజపా ఒక ప్రాంతానికే పరిమితం కావాలనుకుంటే ఆ పార్టీ నేతలు అమరావతికి మద్దతుగా వెళ్లవచ్చు(minister kannababu on three capital citys). అమరావతి ఉద్యమానికి అమిత్ షా మద్దతిచ్చారని భావించే.. మీ తరం కాదని తెదేపా నేతలు మాట్లాడుతున్నట్లున్నారు. రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వస్తామని చంద్రబాబు కల కంటున్నారు. రైతులను కేంద్రం ఆదుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు అంటున్నారు.. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేయలేదో సోము వీర్రాజు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రైతులపై రాజకీయాలు చేయొద్దు.
కన్నబాబు, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి.
కుప్పంలో ఓడిపోతున్నామనే చంద్రబాబు.. దొంగఓట్లు వేశారంటూ కట్టుకథను ప్రచారం చేస్తున్నారని మంత్రి(minister kannababu on kuppam elections) మండిపడ్డారు. కుప్పం మున్సిపాల్టీని వైకాపా కైవసం చేసుకోబోతోందని మంత్రి కన్నబాబు జ్యోసం చెప్పారు.
ఇదీచూడండి: CM KCR: 'ఉలుకు పలుకు లేకుంటే.. కేంద్రాన్ని వెంటాడి వేటాడుతాం'