హైదరాబాద్లోని నారాయణగూడలో క్రైస్తవ సోదరులు ఆత్మల పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. బరియల్ గ్రౌండ్లో ఉన్న శ్మశాన వాటికలోని వారి కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. సమాధులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ పండగ సందర్భంగా చనిపోయిన కుటుంబసభ్యుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారని మంత్రి తెలిపారు. శ్మశాన వాటికలో ఎక్కువ స్థలం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాస్టర్లు మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండిః బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా...!