ETV Bharat / city

కులమతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి కొందరి యత్నం: హరీశ్‌రావు - తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

Harishrao on Telangana National Unity Vajrotsavam: తెలంగాణ గడ్డ ఎప్పటికప్పుడు పెత్తందారులను తిప్పి కొట్టిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కులమతాల పేరుతో కొందరు ప్రజల మధ్య చిచ్చుపేట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంపదలు పెంచు.. ప్రజలకు పంచు అనేది సీఎం కేసీఆర్ నినాదమని అన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Harishrao
Harishrao
author img

By

Published : Sep 16, 2022, 4:44 PM IST

Harishrao on Telangana National Unity Vajrotsavam: ప్రజల మధ్య కులమతాల చిచ్చుతో రాజకీయ లబ్ధికి కొందరు యత్నిస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ గడ్డ ఎప్పటికప్పుడు పెత్తందారులను తిప్పి కొట్టిందని పేర్కొన్నారు. అలాంటి గడ్డపై మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సిద్దిపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.

సంపదలు పెంచు.. ప్రజలకు పంచు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నినాదమని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటోందని హరీశ్​రావు తెలిపారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 8 ఏళ్లలో దక్షిణ భారత ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు.

'ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా సాగుతున్నాం. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్లేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారు. తెలంగాణను దేశ ధాన్యాగారంగా మార్చాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పంటపొలాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట మెడ్‌ ఎక్స్‌పోను విద్యార్థులు సందర్శించాలి. రెండ్రోజులపాటు సిద్దిపేట మెడ్‌ ఎక్స్‌పో ఉంటుంది.'- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

సిద్దిపేట వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన మెడ్ఎక్స్‌పోను మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. గతంలో వైద్యవిద్య కోసం ఉక్రెయిన్, రష్యాకి వెళ్లేవారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో మరిన్నిఅత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేటలో రూ.15కోట్లతో కేథల్యాబ్‌లో గుండె చికిత్సలు అందిస్తామని అన్నారు. వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రేడియోథెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేటలో 900 పడకల ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీ కేటగిరీల్లో లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. పీజీ వైద్య సీట్లను 40వరకు పెంచుతున్నామన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీశ్​తోపాటు కలెక్టర్, సీపీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.