ETV Bharat / city

Harish Rao on Niti Aayog: 'సామాన్యుడికి సైతం ప్రపంచ స్థాయి వైద్యం.. అందుకే మూడో ర్యాంకు' - Niti aayog health index 2021

Harish Rao on Niti Aayog Rank: 'ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రత్యేక దృష్టి సారించడం వల్లే నీతి ఆయోగ్​ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఆరోగ్య తెలంగాణ త్వరలోనే సాకారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు డాక్టర్లు, వైద్య సిబ్బంది, వైద్యారోగ్య శాఖ యంత్రాగానికి ట్విట్టర్​ ద్వారా అభినందనలు తెలియజేశారు.

Harish Rao on Niti Aayog rank
నీతి ఆయోగ్​ ర్యాంకుపై హరీశ్​ రావు
author img

By

Published : Dec 27, 2021, 7:44 PM IST

Harish Rao on Niti Aayog rank: నీతి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు హర్షం వ్యక్తం చేశారు. 2018-19లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది. కేర‌ళ మొదటి స్థానంలో, త‌మిళ‌నాడు రెండో స్థానంలో నిలువగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆరోగ్య రంగంలో పురోగమిస్తున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. అనేక అంశాల్లో తెలంగాణ మెరుగుపడిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.

ఆరోగ్య తెలంగాణ సాకారం

Telangana third in Niti aayog ranks: ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నారని హరీశ్​ రావు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అహ‌ర్నిశ‌లు చేస్తున్న కృషికి ఇది నిద‌ర్శనమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని, ఇందుకు ఇటీవల వరుసగా వస్తున్న ప్రశంసలే నిదర్శనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ప్రపంచ స్థాయి వైద్యం

పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల బలోపేతం మొదలు పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు వరకు రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయని హరీశ్​ వివరించారు. రాష్ట్రంలో సామాన్యుడికి ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్యం అందుతోందని.. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి స్పష్టం చేసిందని వెల్లడించారు. ఈ ఘనత డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగం సాధించిన విజయమని అన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన గ్లోబల్ హెల్త్ హబ్​గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

ఇదీ చదవండి: Harish Rao on Booster dose: 'మనమే ముందున్నాం.. బూస్టర్​ డోసుకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.