ప్రపంచ వ్యాప్తంగా మిషన్ కాకతీయ ప్రశంసలను అందుకున్నా.. కేంద్రం ఆదరణ మాత్రం దక్కలేదన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ పథకం ద్వారా 14 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని శాసనసభలో ప్రకటించారు. ఈ పథకానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అరవింద్ పనగాడియా సిఫార్సు చేశారని.. అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో నీళ్ల మంత్రిగా తాను ఎన్నో సార్లు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. 3000 ఓటీలతో 9వేల చెరువులు నింపుతున్నామన్నారు. ప్రాజెక్టు కాల్వల ద్వారా కూడా చెరువులు నింపుతున్నట్లు శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు జవాబిచ్చారు.
ఇదీ చూడండి: ఏడాదిన్నరలో కొత్త సచివాలయ నిర్మాణం: మంత్రి వేముల