ఉద్యోగుల ఐఆర్, ఫిట్మెంట్ అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో 42 శాతం ఫిట్మెంట్ అడిగితే 43 శాతం ఇచ్చినట్లు గుర్తు చేశారు. కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక హెల్త్ పాలసీ తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సచివాలయంలోని దస్త్రాల తరలింపుపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత రిజిస్టర్లో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. దస్త్రాలు మారే అవకాశం లేదని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: 'పురపాలక' బిల్లుకు శాసనసభ ఆమోదం