ETV Bharat / city

'కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది' - ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు

పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్​లోని టూరిజం ప్లాజాలో ఎస్సీ, ఎస్టీ సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు సమావేశం నిర్వహించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోందని.. అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతామని వ్యాఖ్యానించారు.

minister harish rao fire on central government
'కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది'
author img

By

Published : Mar 6, 2021, 8:53 PM IST

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తివేస్తే... ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోందని.. అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతామని వ్యాఖ్యానించారు.

పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్​లోని టూరిజం ప్లాజాలో ఎస్సీ, ఎస్టీ సంఘాలతో హరీశ్​ రావు సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్ స్ఫూర్తిని దెబ్బతీస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడి, విద్యుత్ సబ్సిడీ ఇచ్చామన్నారు. హైదరాబాద్​లో రూ.146 కోట్లతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ ఆత్మగౌరవ భవనాలు, దళిత స్టడీ సర్కిల్, బుద్ధ భవన్ త్వరలో ప్రారంభమవుతాయన్నారు. భాజపా రెచ్చగొట్టే ప్రకటనలు, మాయమాటలను నమ్మవద్దని కోరారు. మహిళలందరూ సురభి వాణీదేవికే ఓటేయాలని హరీశ్​ రావు కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.