ETV Bharat / city

Dharani News : 'ధరణి టెక్నికల్ మాడ్యూల్స్ రూపొందించాలి' - minister harish rao asked officials to evolve new modules

ధరణి పోర్టల్​లో అవసరమైన మాడ్యూల్స్​ రూపొందించాలని.. వాటిపై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. కలెక్టరేట్లలో ధరణి హెల్ప్​ డెస్క్​లు ఏర్పాటుచేయాలని కోరారు.

Dharani cabinet sub committee meet
Dharani cabinet sub committee meet
author img

By

Published : Nov 17, 2021, 9:03 PM IST

ధరణి పోర్టల్​లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం మాడ్యూల్స్ రూపొందించడం సహా వాటిపై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (Dharani news) బీఆర్కే భవన్​లో ఇవాళ భేటీ అయింది. మంత్రులు సబిత, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.

మైలురాయిగా ధరణి పోర్టల్​..

ధరణి పోర్టల్​లో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించేందుకు మాడ్యూల్స్​లో చేయాల్సిన మార్పులు, చేర్పులుపై సమావేశంలో చర్చించారు. భూ రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందన్న హరీశ్​రావు.. ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగాయన్నారు. నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై 98,049 దరఖాస్తులు రాగా.. వాటిలో 82,472 దరఖాస్తులను పరిష్కరించినట్లు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆకాంక్షల మేరకు ధరణి పోర్టల్​ను మరింత పరిపుష్ఠం చేసేలా పొందుపర్చాల్సిన ఐచ్చికాలపై సమావేశంలో చర్చించారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్​ను త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు హరీశ్​రావు సూచించారు.

శిక్షణ ఇవ్వండి..

ధరణి పోర్టల్​లో ఎదుర్కొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు అనువైన మాడ్యూల్స్, ఆప్షన్స్​ పట్ల సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావడం లేదని హరీశ్​రావు అభిప్రాయపడ్డారు. వీటిపై అధికారులు, మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై.. ధరణి గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కలెక్టరేట్లలో హెల్ప్​డెస్క్​లు నెలకొల్పాలని.. ఇవి ప్రజలకు అవగాహన కల్పించడం సహా దరఖాస్తులను అప్​లోడ్​ చేసేందుకు అనువుగా మీసేవ కేంద్రాల తరహాలో పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సూచించారు. ఇవాళ చర్చించిన అంశాలపై అనువైన టెక్నికల్ మాడ్యూల్స్​ను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 24వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం తిరిగి సమావేశం కానుంది.

ఇదీచూడండి: ktr on Paddy Procurement: 'తెలంగాణ ధనం తీసుకునే కేంద్రం... ధాన్యం తీసుకోదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.