ETV Bharat / city

'కరోనా దెబ్బకు 20శాతం తగ్గిన విమానయాన రంగ మార్కెట్' - hardeep singh commented on corona effect on aviation

కరోనా ప్రభావంతో దేశీయ విమానయాన మార్కెట్​ 20 శాతం తగ్గిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి పేర్కొన్నారు. ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. బేగంపేట విమానాశ్రయంలో నిర్వహిస్తోన్న వింగ్స్​ ఇండియా-2020 ఏవియేషన్​ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కరోనాపై భయాందోళనలు వద్దని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని తెలిపారు.

hardeep singh
'కరోనా ప్రభావంతో విమానయాన మార్కెట్​ 20 శాతం తగ్గింది'
author img

By

Published : Mar 14, 2020, 6:58 PM IST

కరోనా ప్రభావంతో దేశీయ విమానయాన మార్కెట్ 15 నుంచి 20 శాతం తగ్గిందని.. ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామని కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పూరీ తెలియజేశారు. హైదరాబాద్​ బేగంపేట విమానానాశ్రయంలో జరుగుతోన్న వింగ్స్ ఇండియా - 2020 ఏవియేషన్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ రంగం​పై కరోనా ప్రభావం, భవిష్యత్తుపై మాట్లాడారు. వైమానిక ఇంధన ధరలను పదిహేను రోజులకోసారి సమీక్షించేలా కేంద్రాన్ని కోరతామన్నారు.

భవిష్యత్ అవసరాలు, విమానయాన సామర్థ్యం పెంచుకోవడం, కొత్త ఎయిర్ లైన్స్ నిర్వహణకు ప్రస్తుతమున్న ఎయిర్​పోర్టులతో పాటు.. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అనుసంధానించి.. రద్దీగా ఉండే ప్రధాన ఎయిర్ పోర్టులపై భారం తగ్గిస్తామని హర్​దీప్​ సింగ్ తెలిపారు. ఎంఆర్వో ఫెసిలిటీలలో వంద శాతం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని.. ఎయిర్ ఇండియా విక్రయం ద్వారానే దాని మనుగడ, భవితవ్యం దాగున్నాయన్నారు. కరోనాపై భయాందోళనలు వద్దని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని పారదోలచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

'కరోనా ప్రభావంతో విమానయాన మార్కెట్​ 20 శాతం తగ్గింది'

ఇవీచూడండి: కరోనాను విపత్తుగా ప్రకటన- మృతుల కుటుంబాలకు పరిహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.