కల్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబాలకు వరంలా మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పథకం పురోగతిని ఇక నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా సమీక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
కల్యాణలక్ష్మి కోసం రూ.675 కోట్లు విడుదల చేసినట్లు గంగుల తెలిపారు. 2016 నుంచి 2019 వరకు ఉన్న బకాయిల కోసం 44.11కోట్లు, 2019-20, 2020-21 సంవత్సరాల లబ్ధిదారులకు రూ. 591.35 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. నిధులు విడుదలైన నేపథ్యంలో... వాటిని లబ్దిదారులకు త్వరగా అందించాలని ఆర్డీఓలకు మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: 'ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు ఎవరు... ఎప్పుడు చేయించుకోవాలి?