ETV Bharat / city

'రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెరాసను గెలిపించాలి' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు నామినేషన్లు తాజా వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్​ ఆఖరు రోజున ఊపందుకున్నాయి. గన్​ఫౌండ్రి తెరాస అభ్యర్థి మమతా సంతోష్​ గుప్తా, హిమాయత్​నగర్​ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్​లు.. మంత్రి గంగుల సమక్షంలో అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

minister gangula kamalakar participated in nominations for ghmc elections
'రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెరాసను గెలిపించాలి'
author img

By

Published : Nov 20, 2020, 5:49 PM IST

తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే గ్రేటర్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్​ విజ్ఞప్తి చేశారు. గన్​ఫౌండ్రి తెరాస అభ్యర్థి మమతా సంతోష్​ గుప్తా, హిమాయత్​నగర్​ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్​లు నామినేషన్​ వేసే ముందు బషీర్​బాగ్​లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇందులో మంత్రి గంగుల కమలాకర్, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్​లో శాంతి వాతావరణం నెలకొనడంతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి గంగుల అన్నారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని.. దీనిని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదుకుంటే.. భాజపా నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ఇదీ చూడండి: తెరాస గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.