ETV Bharat / city

హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష - corona case in telangana

రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ కేసు నిర్ధరణ అయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి హాంకాంగ్‌లో ఈ వ్యాధి సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఈటల తెలిపారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువ కాబట్టి... కరోనా వ్యాప్తికి అవకాశాలు చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై రేపు మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ktr
ktr
author img

By

Published : Mar 2, 2020, 10:59 PM IST

తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దుబాయ్ వెళ్లి వచ్చిన హైదరాబాదీకి కరోనా నిర్ధరణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బెంగళూరులో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడు దుబాయ్ వెళ్లి... అక్కడ నాలుగైదు రోజుల పాటు హాంగ్​కాంగ్ సహచరులతో కలిసి పనిచేశాడు. తిరిగి బెంగళూరు వచ్చాక.. అక్కడి నుంచి ఫిబ్రవరి 22న హైదరాబాద్ వచ్చాడు. జ్వరంతో అపోలో ఆస్పత్రిలో అవుట్ పేషంట్​గా పరీక్షలు చేయించుకొని.. నిన్న సాయంత్రం 5 గంటలకు గాంధీలో చేరినట్లు ఈటల వివరించారు. పరీక్షలు జరపడంతో.. కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేటెడ్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు ఈటల తెలిపారు.

80 మందిని గుర్తిస్తాం

దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్​లో సుమారు 80 మందిని కలిసినందున.. వారందరినీ గుర్తించే పనిలో ఉన్నట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బాధితుడి సంబంధికులు, తోటి ప్రయాణికులు, కంపెనీ సహోద్యోగులు, పరీక్షలు చేయించుకున్న ఆస్పత్రిలో ఉన్న వారందరినీ ట్రాక్ చేస్తున్నామన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చే ఇతరులకు సోకే అవకాశం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నందున అలాంటి భయం అవసరం లేదన్నారు.

మాస్క్​ల కొరత లేదు

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఈటల ఆదేశించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువ కాబట్టి.. కరోనా వ్యాప్తి అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి గాంధీలో అన్ని వసతులున్నాయని తెలిపారు. గాంధీ, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 40 చొప్పున బెడ్​లు ఏర్పాటు చేసినట్లు ఈటల పేర్కొన్నారు. మాస్క్​లకు ఎలాంటి కొరత లేదని.. ఒకవేళ తగ్గితే తెప్పిస్తామన్నారు. కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

రేపు సమీక్ష

ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై రేపు మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో జరిగే సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. వైద్య, ఆరోగ్యశాఖతో పాటు పురపాలక, పంచాయతీరాజ్, విద్య, రెవెన్యూ, రవాణా, పోలీసు, పర్యాటక, సమాచార-పౌరసంబంధాల శాఖ అధికారులతో మంత్రులు రేపు సమీక్షించనున్నారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో మంత్రులు సమావేశం కానున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సమీక్షించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.