వైద్యారోగ్యశాఖ మంత్రిగా తనకు సహకరించిన అందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. గత 395 రోజులుగా నిర్విరామంగా ఉద్యోగులు కృషి చేశారని కొనియాడిన ఈటల... కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడారని పేర్కొన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండి వైద్య సేవలు అందించారని ఈటల వివరించారు. ఆరోగ్యశాఖలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం... వైద్యారోగ్య శాఖను ఆయన నుంచి తప్పించింది. ఆ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసింది.