కరోనా పాజిటివ్ వచ్చిన అమ్మాయికి గాంధీలో చికిత్స అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... త్వరలోనే డిశ్చార్జ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరు అనుమానితుల్లో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డమీద కరోనా వైరస్ లేదని.. పాజిటివ్ వచ్చిన వారు విదేశాల నుంచి వచ్చిన వారని ఈటల వివరించారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షణ కోసమే వికారాబాద్‌కు తరలిస్తామని... కరోనా పాజిటివ్ ఉన్న వారిని కాదని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ 19 పాజిటివ్ వస్తే గాంధీ, ఛాతి ఆస్పత్రుల్లోనే వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?: జగన్