ETV Bharat / city

'ప్రతీ అంగుళాన్ని ఆన్​లైన్​లో నమోదు చేయాలి'

వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్ నమోదు నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి ఇళ్లు, అంగుళాన్ని ఆన్​లైన్​లో నమోదు చేయాలని తెలిపారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం కల్పించాలని అధికారులకు సూచించారు.

minister errabelli dayaker rao review on village properties

author img

By

Published : Sep 29, 2020, 9:04 PM IST

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయేతర భూములకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలని, ప్రతి ఇంచూ ఆన్​లైన్​లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్ నమోదు నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి ఇళ్లు, అంగుళాన్ని ఆన్​లైన్​లో నమోదు చేయాలని తెలిపారు.

ఆస్తులకు భద్రత కల్పించటమే కాకుండా ఆయా భూ, ఇళ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే సీఎం లక్ష్యమని ఎర్రబెల్లి తెలిపారు. అందుకు అనుగుణంగా గ్రామాల్లోని ప్రతి ఇల్లు, ఇత‌ర నిర్మాణాల వివ‌రాలు, వ్యవ‌సాయ క్షేత్రాల్లోని ఇళ్లు, తదితరాలన్నింటినీ పూర్తిగా ఆన్​లైన్​లో నమోదు చేయాలని తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్న మంత్రి... ప్రజల్లో ఏవైనా అనుమానాలు, అపోహలు ఉంటే తొలగించాలని చెప్పారు.

ద‌ళారులు, ఇత‌రులెవ‌రికీ డ‌బ్బులు ఇవ్వాల్సిన ప‌నిలేద‌న్న విషయాన్ని... ఆన్​లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జ‌రుగుతుంద‌ని ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఎర్రబెల్లి సూచించారు.

ఇదీ చూడండి: వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు నజర్​... కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.