జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
నాయిని కుటుంబసభ్యులు, అల్లుడు శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని... త్వరలో కోలుకొని వస్తారని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈటల వెంట మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ కూడా ఉన్నారు.
ఇదీ చూడండి: విష జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి: ఈటల