ETV Bharat / city

బీబీనగర్ ఎయిమ్స్​ ఆసుపత్రిపై మంత్రి ఈటల సమీక్ష - ఎయిమ్స్ డైరెక్టర్ వైద్యులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ ఎయిమ్స్​ ఆసుపత్రి నిర్మాణ పనులు, నిర్వహణపై... ఆసుపత్రి డైరెక్టర్, ఇతర వైద్యులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

minister eetala rajendar review on bibinagar aiims
బీబీనగర్ ఎయిమ్స్​ ఆసుపత్రిపై మంత్రి ఈటల సమీక్ష
author img

By

Published : Nov 9, 2020, 9:07 PM IST

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి డైరెక్టర్, ఇతర వైద్యులతో పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, అకడమిక్ వివరాలను ఎయిమ్స్​ డైరెక్టర్ మంత్రికి వివరించారు.

ఆసుపత్రి నిర్మాణ పనులు, నిర్వహణ సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. నీటి సరఫరా, బిల్డింగ్ నిర్మాణం, ఇతర సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

ఇదీ చూడండి: రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.