ఇసుక క్వారీల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని శాసన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 33ఇసుక క్వారీలు ఉన్నాయని పేర్కొన్నారు. లారీలు ఓవర్లోడ్తో వెళ్తుండటం వల్ల జిల్లా పరిధిలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమైతున్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు బాగులేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. తక్షణమే కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ అసెంబ్లీ తీర్మానం