ETV Bharat / city

Botsa On Chandrababu: 'జగన్‌ పథకాలను చంద్రబాబు ఏనాడైనా మెచ్చుకున్నారా?'

Botsa On Chandrababu: జగన్‌ పథకాలను చంద్రబాబు ఏనాడైనా మెచ్చుకున్నారా? అని ఏపీ మంత్రి బొత్స ప్రశ్నించారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటే.. ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Botsa slams chandrababu
Minister Botsa slams chandrababu
author img

By

Published : Dec 8, 2021, 9:08 PM IST

Botsa On Chandrababu: పేద ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 30 లక్షల ఇళ్లు ఇవ్వాలని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తలిస్తే.. అక్రమాలు జరిగాయని కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. విశాఖపట్నంలో పేదల ఇళ్ల కోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తే స్టే తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. హైదరాబాద్​లో మాట్లాడిన మంత్రి.. 30 లక్షల ఇళ్లు, లే అవుట్‌లో 5 శాతం భూమి అనేవి పేదల సంక్షేమ కోసం మాత్రమేనని స్పష్టం చేశారు.

జగన్మోహన్‌ రెడ్డి పథకాలను చంద్రబాబు ఏనాడైన మెచ్చుకున్నారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఏపీ రాజకీయాలను శాసించేందుకు చంద్రబాబు చూస్తున్నారన్నారు. పేద వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం దృఢ సంకల్ఫంతో పనిచేస్తోందన్న ఆయన.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా సంక్షేమ పథకాలు ఆగవన్నారు. లే ఔట్‌ల ద్వారా వచ్చే 5 శాతంతో భూబ్యాంకును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

లేఅవుట్​లో ఐదు శాతం స్థలం.. ఏంటంటే

‘కొత్తగా వేసే ప్రైవేటు లే అవుట్లలో 5% స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలి. సాధ్యం కాదనుకుంటే ప్రాథమిక విలువపై స్థలానికి డబ్బైనా చెల్లించాలి' అని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జారీ చేసింది. ఈ మేరకు 2017 లేఅవుట్‌, సబ్‌-డివిజన్‌ నిబంధనలను సవరించారు. ప్రస్తుతం ప్రతి లేఅవుట్‌లో 10% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్న దానికి ఇది అదనం. ఈ స్థలాన్ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు పురపాలకశాఖ పేర్కొంది. పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వేసే లేఅవుట్లకు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

లేఅవుట్‌కు 3 కిలోమీటర్లలోపైనా ఇవ్వొచ్చు

  1. లేఅవుట్‌లో 5% స్థలాన్ని కేటాయించడం సాధ్యం కాదనుకుంటే అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోపు అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వొచ్చని పురపాలకశాఖ తెలిపింది.
  2. స్థలం ఇవ్వదలచుకోకుంటే లేఅవుట్‌ ప్రాథమిక విలువపై (బేసిక్‌ వాల్యు) 5% స్థలానికి డబ్బు చెల్లించొచ్చు. స్థలం లేదా డబ్బును జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని పురపాలకశాఖ పేర్కొంది.

స్థిరాస్తి వ్యాపార రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ భారాన్ని భరించడానికి సిద్ధంగా లేమని...కొనుగోలుదారులపైనే వేస్తామంటున్నారు. ఈ ఉత్తర్వులపై తెదేపా నేతలతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో ఎవరికి మేలని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.