ETV Bharat / city

వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన: అమర్​నాథ్​ - Vishaka capital breaking

Minister Amarnath on Three Capitals: ఏపీలో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్​ రాజధాని రైతులు రెండో విడత మహా పాదయాత్ర చేపట్టారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని వైసీపీ నేతలు.. విశాఖ నుంచి వచ్చే ఏడాది నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెబుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి అమర్​నాథ్​​ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

VJA Minister Amarnath on Vishaka capital breaking

author img

By

Published : Sep 16, 2022, 7:13 PM IST

Minister Amarnath on Three Capitals: ఆంధ్రప్రదేశ్​లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని ఆ రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్​మెంట్​ మీట్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలను తెదేపా నిరూపించాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఈ క్రమంలోనే అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని అమర్​నాథ్​ ప్రశ్నించారు. విశాఖలో రాజధానికి ప్రైవేట్ భూమి సెంటు కూడా తీసుకోలేదని తెలిపారు. రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి అమర్​నాథ్​ సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.