ETV Bharat / city

లాక్​డౌన్​ను 10 రోజుల మించి పెంచకూడదు: అసదుద్దీన్ - telangana lock down

రాష్ట్ర ఆరోగ్య విధానంలో కోర్టులు జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణలో లాక్​డౌన్​ విధించడం వల్ల ఎంతో మంది జీవనోపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

asaduddin owaisi, asaduddin owaisi on lock down
అసదుద్దీన్, ఎంపీ అసదుద్దీన్, లాక్​డౌన్​పై అసదుద్దీన్ స్పందన
author img

By

Published : May 11, 2021, 5:09 PM IST

తెలంగాణలో లాక్​డౌన్​ విధింపుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. లాక్​డౌన్​ వల్ల ఎంతో మంది జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మరెంతో మంది జీవితాల్ని ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు.

లాక్​డౌన్ వల్ల ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ కోరారు. లాక్​డౌన్​ను 10 రోజులకు మించి పొడిగించకూడదని విజ్ఞప్తి చేశారు.

హైకోర్టు ఒత్తిడి వల్లే.. ప్రభుత్వం లాక్​డౌన్ విధించిందని ఎంపీ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య విధానంలో కోర్టులు జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజ్యంగ బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ సర్కార్ అపెక్స్ కోర్టు సాయం తీసుకోవాలని సూచించారు.

asad tweet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.