ETV Bharat / city

'ఆ పదాలు వాడకుండా ప్రచారం నిర్వహించగలరా...?' - ghmc elections 2020

హైదరాబాద్​ భోలక్‌పూర్‌లో ఎంఐఎం బహిరంగసభ నిర్వహించింది. సమావేశంలో పాల్గొన్న అసదుద్దీన్​ ఓవైసీ.. భాజపా నేతలకు సవాల్​ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ దాడులు చేసి పాకిస్తానీయులను వెలికితీస్తామనటాన్ని తీవ్రంగా ఖండించారు.

mim leader asaduddin owaisi on surgical strikes on old city
mim leader asaduddin owaisi on surgical strikes on old city mim leader asaduddin owaisi on surgical strikes on old city
author img

By

Published : Nov 24, 2020, 9:37 PM IST

'ఆ పదాలు వాడకుండా ప్రచారం నిర్వహించగలరా...?'

భాజపా నాయకులకు అభివృద్ధి గురించి చెప్పుకొనే ధైర్యం లేక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. హైదరాబాద్​ భోలక్‌పూర్‌లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. సర్జికల్ దాడుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ దాడులు చేసి పాకిస్తానీయులను వెలికితీస్తామనటాన్ని తీవ్రంగా ఖండించారు.

భారత భూభాగంలో 970 చదరపు కిలోమీటర్లలో కబ్జా చేసిన చైనా పేరు పలికే ధైర్యం లేదు కానీ... స్వదేశంలో సర్జికల్ దాడులు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత భూభాగంపై పాకిస్తానీయులు ఉండేందుకు ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని ఓవైసీ తేల్చి చెప్పారు. పాతబస్తీలో ఎంత మంది పాకిస్తానీయులు ఉన్నారో 24గంటల్లో లెక్కలు తేల్చాని కేంద్రహోం శాఖను ఓవైసీ డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌, టెర్రరిజం, రోహింగ్యా లాంటి పదాలు వాడకుండా ప్రచారం నిర్వహించగలరా అని భాజపా నేతలకు అసదుద్దీన్‌ సవాల్‌ విసిరారు.

ఇదీ చూడండి: 'నల్లధనమంతా భాజపా నాయకుల జేబుల్లోకే పోయింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.