MIM Corporator Arrest: హైదరాబాద్ బోలక్‌పూర్‌లో పోలీసులతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. డీజీపీకి చేసిన ట్వీట్‌పై పోలీసులు స్పందించారు. కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పూట... బోలక్‌పూర్‌లో తెరిచి ఉంచిన దుకాణాలు మూసేయాలని దుకాణదారులకు పోలీసులు చెప్పారు. రంజాన్ సందర్భంగా తెరుచుకున్నామంటూ దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులపై దుర్భాషలాడారు. వాళ్లపైకి దూసుకెళ్లి దౌర్జన్యం చేశారు. దుకాణాలు మూసేదిలేదని వారితో వాగ్వాదానికి దిగాకు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
-
Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
— KTR (@KTRTRS) April 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
">Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
— KTR (@KTRTRS) April 6, 2022
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
— KTR (@KTRTRS) April 6, 2022
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
పోలీసులను ధూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన కేటీఆర్ డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావులేదని, తప్పు చేసిన వాళ్లపై రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు.
ఇదీచూడండి:
పోలీసులపై కార్పొరేటర్ దౌర్జన్యం.. కేటీఆర్ ట్వీట్.. డీజీపీ యాక్షన్