ETV Bharat / city

చలికాలంలోనూ కర్ణాటక పాలేనా!

చలికాలం వచ్చిందంటే పశువులు దండిగా పాలిస్తాయి. అందుకే శీతాకాలాన్ని ‘అధిక పాల ఉత్పత్తి కాలం’గా భావించడం ఆనవాయితీ. కానీ ఈ సీజన్‌లోనూ రాష్ట్రంలో వేసవి మాదిరిగా పాల కొరత కనిపిస్తోంది. అందుకే కర్ణాటక నుంచి రోజూ 50వేల లీటర్ల వరకూ ఆవుపాలను ‘రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య’(విజయ డెయిరీ) కొంటోంది.

milk production not increase in winter season also telangana
చలికాలంలోనూ కర్ణాటక పాలేనా!
author img

By

Published : Nov 7, 2020, 7:32 AM IST

శీతాకాలంలో పాల ఉత్తపత్తి ఎక్కువగానే ఉంటోంది. కానీ ఇక్కడ పాల ఉత్పత్తి అంతగా పెరగలేదు. ఎందుకుంటే ఇప్పటికి కూడా కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విజయతో పాటు, కరీంనగర్‌, ముల్కనూర్‌, రంగారెడ్డి-నల్గొండ జిల్లాలకు చెందిన నార్ముల్‌ డెయిరీల పరిధిలో సుమారు 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.100 కోట్ల బకాయిలు ఏడాదికాలంగా పేరుకుపోయాయి. ఈ డెయిరీలకు రోజూ పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ క్రమంలో ఆ నిధుల పంపిణీ బాధ్యతలు చూసే విజయ డెయిరీ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల సిద్దిపేట జిల్లా పాడిరైతులకు మాత్రమే ఈ బకాయిలను పశుసంవర్ధకశాఖ విడుదల చేసింది.

ఎందుకీ సమస్య..

రాష్ట్ర రాజధానిలో పాలు, పాల ఉత్పత్తులు అధికంగా విక్రయించే విజయ డెయిరీకి రోజూ 3.50లక్షల లీటర్ల పాలు అవసరం. ప్రస్తుతం రోజుకు 2.60లక్షల లీటర్ల వరకే రైతుల నుంచి వస్తున్నాయి. మిగతావి కర్ణాటక, స్థానిక చిన్న డెయిరీల నుంచి కొంటోంది. లాక్‌డౌన్‌కు ముందు నుంచే కొరత కారణంగా విజయ డెయిరీ ఇతర రాష్ట్రాల నుంచి పాలు కొంటోంది. వానాకాలంలో వర్షాలు బాగా పడటం, పంటల అధిక సాగు వల్ల పాల ఉత్పత్తి సైతం అధికమవుతుందని సీజన్‌కు ముందు అంచనా వేశారు. కానీ పాడిరైతులకు ప్రోత్సాహకాలేమీ లేకపోవడంతో, పంటల సాగుపై ఎక్కువ శ్రద్ధ పెట్టారని, అందుకే పాల ఉత్పత్తి పెరగలేదని ఓ అధికారి వివరించారు. ఖర్చులు భరించలేక పాడి పశువులను రైతులు వదిలించుకుంటున్నారు. ఉదాహరణకు ఇటీవల జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపురంలో పోసిన వేలాది లీటర్ల పాలు నాణ్యంగా లేవని లీటరుకు రూ.19.50 మాత్రమే చెల్లించినట్లు అక్కడి రైతులు ‘ఈనాడు’కు చెప్పారు. ఇంత తక్కువ ధర గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.

ధర పెంచాలని అడిగాం

- జనగామ సోమిరెడ్డి, అధ్యక్షుడు జనగామ జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం

పాడి పశువుల నిర్వహణ రైతులకు భారంగా మారింది. పశువుల దగ్గర పనికి కూలీలే దొరకడం లేదు. వచ్చినా రోజుకు రూ.400 నుంచి 500 అడుగుతున్నారు. దాణా ధరలూ పెరిగిపోయాయి. పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటోందని డెయిరీలు ధరలో కోత పెట్టడం వల్ల రైతులకు కనీస ఖర్చులు కూడా రావటం లేదు. పాల ధర పెంచాలని అడుగుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే లీటరుకు రూ.4 ప్రోత్సాహకం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. మిగతా పంటలు వేసే రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం.. పాడిరైతులను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తే ఇతర రాష్ట్రాల నుంచి పాలు కొనాల్సిన అవసరం ఉండదు.

ఇదీ చూడండి: ఆర్థిక నష్టం, బడ్జెట్​పై ముఖ్యమంత్రి మధ్యంతర సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.