ETV Bharat / city

మిలన్-2022 ప్రారంభం.. విశాఖ నౌకాశ్రయానికి చేరిన పలు దేశాల నౌకలు

author img

By

Published : Feb 25, 2022, 10:40 PM IST

Milan 2022: బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం.. "మిలన్ -2022" ప్రారంభమైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. "సాంగత్యం, పొందిక, సహకారం" అన్న లక్ష్యంతో.. మిలన్ నిర్వహణను చేపట్టారు. ఎనిమిది రోజులపాటు రెండు దశల్లో పాల్గొనేందుకు పలు దేశాలకు చెందిన నౌకలు.. విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. 27న ఆర్కే బీచ్​లో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ హాజరై నౌకాదళం సాహస విన్యాసాలు వీక్షిస్తారు. ఇందుకోసం నౌకా దళం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

Milan 2022
విశాఖ నౌకాశ్రయానికి చేరిన పలు దేశాల నౌకలు

Milan 2022: బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్ - 2022 ప్రారంభమైంది. 8 రోజుల పాటు రెండు దశల్లో పాల్గొనేందుకు.. పలు దేశాలకు చెందిన నౌకలు విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. నేటినుంచి ఈనెల 28 వరకు హార్బర్ దశగా పరిగణిస్తారు. మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు సముద్ర దశలో ఈ విన్యాసాలు జరగనున్నాయి.

హార్బర్ దశలో భాగంగా తొలిరోజున సాంకేతిక అంశాలను వివిధ నేవీల ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వారికి భారత నౌకాదళం పలు అంశాలను వివరిస్తూనే, వారి నుంచి సాంకేతికతలను తెలుసుకుంటోంది. శనివారం తూర్పు నౌకాదళంలో నేవీల ఆధునికతపై సదస్సు నిర్వహించనుండగా.. పలు దేశాల నావీ అధికారులు హాజరవనున్నారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా 'సాంగత్యం, పొందిక, సహకారం' (Camaraderie – Cohesion – Collaboration) లక్ష్యాలుగా ఈ మిలన్ నిర్వహణను చేపట్టారు. ఆదివారం విశాఖ ఆర్కే బీచ్​లో​ అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో నేవీ కవాతుతో పాటుగా, సాంస్కృతిక బృందాలు వివిధ సంస్కృతులకు అద్దంపట్టేలా సాగుతాయి. ఆ కార్యక్రమానికి నౌకాదళ చీఫ్​తో పాటు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవనున్నారు. ఈనెల 27న నగరానికి విచ్చేయనున్న సీఎం.. ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక, జలాంతర్గామి ఐఎన్ఎస్ లను కూడా సందర్శించనున్నారు.

అంతర్జాతీయ సాంస్కృతిక బృందాలతో నేవీ నిర్వహించే ఈ పరేడ్ ఆకర్షణీయంగా సాగనుంది. పరేడ్​లో భాగంగా నౌకాదళం సాహస విన్యాసాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. గగన తలంలో ఎయిర్ క్రాప్టులు, హెలీకాప్టర్లు సాహస కృత్యాలు చేస్తాయి. ఇప్పటికే ఆర్కే బీచ్​లో..నౌకాదళం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో ఇతర స్నేహపూరిత దేశాల నేవీలకు అహ్వానాలను పంపారు. బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, ఫ్రాన్స్ నౌకలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి.

ఇదీచూడండి: Hyderabad dangerous Auto Race: నడిరోడ్డుపై ఆటో రేస్.. పట్టుజారితే ఖల్లాస్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.