ETV Bharat / city

లాక్‌డౌన్‌ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వలస కార్మికులు పయనం - telangana varthalu

రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించటంతో వలస కార్మికులు మళ్లీ సొంత ఊర్ల బాట పడుతున్నారు. లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగిస్తారనే భయంతో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫలితంగా బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు రిజర్వేషన్ టికెట్లు దొరకడం లేదు.

migrate labour
లాక్‌డౌన్‌ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వలస కార్మికులు పయనం
author img

By

Published : May 17, 2021, 3:18 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వలస కార్మికులు పయనం

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో భవన నిర్మాణ, వలస కార్మికులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ప్రభుత్వం కేవలం 4 గంటలు సడలింపు ఇవ్వటంతో వెసులుబాటు కల్పించిన సమయంలోనే రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికులు గుమిగూడకుండా గంట ముందు మాత్రమే రైల్వే సిబ్బంది వారిని లోపలికి అనుమతిస్తున్నారు. బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరికి టిక్కెట్లు దొరక్క... మరికొందరికి రిజర్వేషన్ కన్ఫార్మ్ అవ్వక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే నిద్రిస్తున్నారు.

ముందుకొస్తున్న దాతలు

నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులు వస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేసన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతున్న వలస కార్మికులకు... పోలీసులు భోజనం, మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైళ్ల వివరాలు, రిజర్వేషన్ వంటి విషయాలను వారికి తెలియజేస్తున్నారు. కార్మికులకు అండగా నిలిచేందుకు పోలీసులతో పాటు మరికొందరు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యం సుమారు 80 నుంచి 100 మందికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

ముందే చేరుకుంటున్నారు..

లాక్‌డౌన్ కారణంగా రైలు సమయం కంటే ముందే ప్రయాణికులు స్టేషన్లకు చేరుకుంటున్నారు. కానీ అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. దుకాణాలు, హోటళ్లు మూసివేసి ఉండటంతో కనీసం మంచినీళ్లు లభించక అవస్థలు పడుతున్నామన్నారు. ఇలాంటి తరుణంలో భోజనం సమకూర్చుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టు ఉంటేనే..

కొన్ని రాష్ట్రాలు 72 గంటల్లో పరీక్ష చేసుకున్న ఆర్టీపీసీఆర్​ నెగెటివ్ రిపోర్టు లేదా రెండో డోసు టీకా వేసుకున్న సర్టిఫికెట్ ఉంటేనే తమ రాష్ట్రాల్లోకి ప్రయాణికులను అనుమతిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆయా రాష్ట్రాల నిబంధనలు పాటించాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి: కొవిడ్‌ కష్టకాలంలో అన్నార్తుల ఆకలితీరుస్తున్న మానవతావాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.