ETV Bharat / city

ఈ నెల 7 నుంచి భాగ్యనగరంలో మెట్రో కూత.. - సెప్టెంబరు 7 నుంచి మెట్రో సేవలు

ఈ నెల 7నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్రం అన్​లాక్-4లో భాగంగా దేశ వ్యాప్తంగా మెట్రో రైల్లు న‌డిపేందుకు స‌డ‌లింపులు ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా మెట్రో రైలు న‌డిపేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు హైద‌రాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రక‌టించారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో శానిటైజేషన్‌, భౌతికదూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

metro services start in hyderabad september 7 onwords
ఈ నెల 7 నుంచి భాగ్యనగరంలో మెట్రో కూత..
author img

By

Published : Sep 2, 2020, 6:24 AM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఈ నెల 7 నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రాబోతున్నాయి. మార్చి 22 నుంచి సుమారు 5 నెల‌లకు పైగా మెట్రో సేవ‌లు నిలిచిపోయాయి. అన్​లాక్-4లో భాగంగా దేశంలో మెట్రో రైళ్ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో గ్రేడెడ్ పద్ధతిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్ల‌డించారు. మెట్రో రైళ్ల‌ పున ప్రారంభం‌, తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలపై దేశంలోని అన్ని మెట్రోల ఎండీలతో మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ జ‌రిగింది.

మెట్రో సర్వీసులు నిర్వ‌హణపై కేంద్రం ఇచ్చే నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుపుతామ‌ని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోలో కరోనా వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. కొవిడ్ నిబంధ‌నలు పాటిస్తూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌కు అనుగుణంగా... సీట్ల మధ్య ఖాళీ ఉంచ‌నున్నారు. ప్రారంభంతోనే... ఎక్కువ సంఖ్య‌లో సర్వీసులు న‌డ‌ప‌కుండా... ర‌ద్దీని బ‌ట్టి నడిపే అవకాశం ఉంది. ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించ‌డం, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. స్టేష‌న్ల‌లోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో నిర్వ‌ాహ‌కులు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయ‌నున్నారు.

అన్​లాక్ మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చే స‌మ‌యంలోనే హైద‌రాబాద్ మెట్రో రైలు నిర్వ‌ాహ‌కులు ముంద‌స్తుగా స‌న్న‌ద్దం అయ్యారు. 5 నెల‌లకు పైగా... స్టేష‌న్లు మూసివేసి ఉండ‌టం వల్ల... చెత్త, దుమ్ముతో నిండాయి. మెట్రో స్టేష‌న్లను తెరిచి వారం రోజుల కింద‌టి నుంచే శుభ్రం చేశారు. మిగిలిన మెట్రో సంబంధిత‌ కార్యాల‌యాలు, టె‌క్నిక‌ల్ కు సంబంధించిన విష‌యాలపై అధికారులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 5 నెల‌లకు మెట్రో సేవలు నిలిచిపోయి... ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 250 కోట్లకుపైగా ‌ఆదాయం కోల్పోయింది.

ఈ ఐదు నెలల్లో న‌గ‌రంలో చాలా మంది సొంత‌ వాహనాలపై ప్రయాణించేందుకు మొగ్గు చూపారు. క‌రోనాతో ప్ర‌జార‌వాణా‌ను ఎవరూ ఉపయోగించడం లేదు. ఇక మెట్రోను ఎక్కుగా ఆశ్రయించే సాఫ్ట్​వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. మెట్రో ప్రారంభ‌మైనా గ‌తంలోలా ఆద‌రిస్తారా లేదా అనేది చూడాలి. అయితే న‌గ‌రంలో ఇప్ప‌టికీ సిటీ బ‌స్సులు కూడా న‌డ‌ప‌క‌పోవ‌డం వల్ల... కొంత వ‌ర‌కు మెట్రోను ఆశ్ర‌యించే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇదీ చూడండి: మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.