తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాత్రికల్లా అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపటికి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 26న ఉదయం ఒడిశా - బెంగాల్ తీరం తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. అదే రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా తుపాన్ ప్రభావం ఉంటుందని, ఇవాళ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఏపీలోని కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తుపాను దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్న వాతావరణ శాఖ.. జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై సీఎంకు ఫిర్యాదు