ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర కొనసాగుతోంది. నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ఉదయగిరి వరకు యాత్ర కొనసాగనుంది. నెల్లూరులో ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకోనుంది. ఈ యాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యలో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని నెల్లూరు పాలెం సెంటర్లో ఐదు నిమిషాలు ఉంచుతారు.
అంత్యక్రియల్లో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్
ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల(మెరిట్స్) వద్దకు చేరుకున్న అనంతరం.. కళాశాల సమీపంలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: