గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాలు ఇవాళ సమావేశం కానున్నాయి. గతంలో జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సమన్వయ కమిటీ స్థానంలో ఉప సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇవాళ హైదరాబాద్ జలసౌధలో జరగనుంది. ఉదయం 11 గంటలకు గోదావరి బోర్డు ఉపసంఘం, మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశమవుతాయి.
గోదావరి ఉప సంఘానికి బోర్డు సభ్యకార్యదర్శి, కృష్ణా ఉప సంఘానికి బోర్డు సభ్యుడు కన్వీనర్‌గా ఉన్నారు. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్కో అధికారులు ఉపసంఘంలో సభ్యులు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై భేటీలో చర్చిస్తారు.
ఇదీ చూడండి: Saidabad Rape Case: కోట్ల మనసుల కోరిక తీరింది... కామాంధుడి కథ ముగిసింది..