ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ వైద్య సీట్లకు సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విడతల వారీగా పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సుమారు 900 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. అదే సమయంలో ఏపీ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 145 పీజీ సీట్లు పెంచేందుకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయి.
ఎంబీబీఎస్ సీట్లకు సమానంగా పెంచితే మరింత మంది విద్యార్థులకు పీజీ విద్యను చేరువ చేసే అవకాశం కలుగుతుంది. కళాశాలల్లో పీజీ సీట్లు ఏర్పాటు చేయాలంటే దానికి తగిన మౌలిక వసతులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టారు.
ఇవీ చదవండి: తుది దశకు నూతన కలెక్టరేట్ల భవనాల నిర్మాణం.. 20 నుంచి ప్రారంభోత్సవాలు