ETV Bharat / city

ఆక్సిజన్ సరఫరాలో ముందంజ..ప్రాణదాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ - విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఆక్సిన తయారీ వార్తలు

దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్న వేళ.. మెడికల్‌ ఆక్సిజన్‌ గురించే చర్చంతా. బాధితులకు చికిత్సలో కీలకమైన ప్రాణవాయువు కొరత లేకుండా కేంద్రం శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంకల్పం నెరవేర్చడంలో స్టీల్‌ ప్లాంట్‌లు ప్రధాన భాగస్వాములవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం.. ఆక్సిజన్ ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తూ..దేశ, రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడుతోంది.

vishakha steel plant
ఆక్సిజన్ సరఫరాలో ముందంజ..ప్రాణదాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌
author img

By

Published : Apr 18, 2021, 9:04 PM IST

ఆక్సిజన్ సరఫరాలో ముందంజ..ప్రాణదాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

కరోనా కట్టలు తెచ్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం అంతకంతకూ పెరుగుతోంది. ఈ దశలో ప్రాణవాయువు కొరత లేకుండా చూడాలన్న కేంద్రం.. ఉత్పత్తి పెంచాలని ఉక్కు కర్మాగారాలన్నింటికీ ఆదేశాలిచ్చింది. సెయిల్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, జెఎస్​పీఎల్, జేఎస్​డబ్ల్యూ వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉక్కు కర్మాగారాలు.. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను.. యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి.

కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారానిది ప్రముఖ స్థానం. గతేడాది.. కరోనా విజృంభించిన వేళలోనూ.. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసిన ఘనత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌దే. కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రితో పాటు సమీప యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతం కాగా.. ఆక్సిజన్ ఉత్పత్తి మరింత పెంచాలని కేంద్రం అన్ని స్టీల్‌ ప్లాంట్లనూ ఆదేశించింది. ఈసారీ ఆక్సిజన్‌ సరఫరాకు సన్నద్ధంగా ఉన్నామని కర్మాగార సిబ్బంది చెబుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే.. దేశ ప్రయోజనాలకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: ట్యాంకర్లలో ఆక్సిజన్​ సరఫరా: భారతీయ రైల్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.