Medaram Jatara 2022 : రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మేడారం జాతరకు గతంలో రూ.70వేల కోట్లు.. ఈసారి రూ.100 కోట్ల నిధులను కేటాయించారని పేర్కొన్నారు. మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో హెలికాప్టర్ సేవలను మంత్రి ప్రారంభించారు. జాయ్‌రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని వివరించారు. జాయ్‌రైడ్ ద్వారా గగన విహారం చేస్తూ మేడారం జాతర చూడవచ్చన్నారు. ఈ సేవలు ఇవాళ్టి (ఫిబ్రవరి 15) నుంచి ఈ నెల 20 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
"మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్‌రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. జాయ్‌రైడ్ ద్వారా గగన విహారం చేస్తూ మేడారం జాతర చూడవచ్చు. సుమారు 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ అవకాశం ఉంటుంది. హనుమకొండ -మేడారం వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు షటిల్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. షటిల్ సర్వీస్‌తో.. 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోవచ్చు. కరీంనగర్ -మేడారం, హైదరాబాద్-మేడారం, మహబూబ్‌నగర్-మేడారం రూట్లలో చార్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 5 సీట్స్ ఉంటాయి. వీఐపీ దర్శనం కూడా కల్పిస్తారు." - శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
హెలికాప్టర్ సర్వీస్‌ల పూర్తి వివరాలు..
హెలికాప్టర్ సర్వీస్ | రూట్లు | ప్రత్యేకత | టికెట్ ధర |
జాయ్‌రైడ్ సర్వీస్ | మేడారంలో గగన విహారం | 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం | 3,700 |
షటిల్ సర్వీస్ | హనుమకొండ -మేడారం | కేవలం 20 నిమిషాల్లో జాతరకు | 19,999 |
చార్టర్ సర్వీస్ | హైదరాబాద్-మేడారం | -ఇందులో 5 సీట్లుంటాయి. -వీఐపీ దర్శనం కల్పిస్తారు. | 75,000 |
కరీంనగర్ -మేడారం | 75,000 | ||
మహబూబ్‌నగర్-మేడారం | 1,00,000 |
ఇదీ చూడండి: