ETV Bharat / city

MBBS seats in Telangana : తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు - తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు 2023

MBBS seats in Telangana : తెలంగాణ వైద్యవిద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో మరో 1200 సీట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే 900 సీట్లకు అనుమతి రాగా మరో 300 త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 6,240 సీట్లు అందుబాటులోకి వస్తాయి.

MBBS seats in Telangana
MBBS seats in Telangana
author img

By

Published : Sep 9, 2022, 9:30 AM IST

MBBS seats in Telangana : రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి.

MBBS seats in Telangana fr 2022-23 : ప్రైవేటు రంగంలో గత ఏడాది టీఆర్‌ఆర్‌, మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఆర్‌, మహావీర్‌ కళాశాలల విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఎంఎన్‌ఆర్‌ కళాశాలపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. ఈ క్రమంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కళాశాలకు తాజాగా అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఆర్‌, మహావీర్‌ కళాశాలల్లోనూ తుదివిడత తనిఖీలు పూర్తి చేసినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల సీట్లు కొనసాగే అవకాశాలే ఎక్కువని సమాచారం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో కలిపి 6,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

రెండు వారాల్లో రాష్ట్ర ర్యాంకులు.. నీట్‌ అఖిల భారత ర్యాంకులు విడుదలైనా.. ఆ సమాచారం రాష్ట్రానికి చేరడానికి మరో రెండు వారాలు పట్టవచ్చని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. దాని ఆధారంగా రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ర్యాంకులను విడుదల చేస్తారని, కానీ దరఖాస్తుల పరిశీలన అనంతరమే తుది ర్యాంకులు తెలుస్తాయని పేర్కొన్నాయి. మరో 4 వారాల తర్వాతే రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటన జారీ చేస్తామని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఆహ్వానిస్తామని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

అఖిలభారత కోటాకు 375 సీట్లు.. జమ్మూ కశ్మీర్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్యకళాశాలల నుంచి సేకరించిన 15 శాతం సీట్లతో నిర్వహించనున్న అఖిలభారతస్థాయి ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ప్రవేశాల కంటే ముందుగానే నిర్వహిస్తారు.

తెలంగాణ నుంచి అఖిలభారత కోటాకు గత ఏడాది 240 ఎంబీబీఎస్‌ సీట్లు ఇవ్వగా, ఈ ఏడాది సీట్లు పెరగడంతో ఆ సంఖ్య 375కు చేరనుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 190 సీట్లు రాష్ట్రానికి అదనంగా వస్తాయి. అఖిలభారత కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు కేటాయిస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిలభారత ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జారాష్ట్రస్థాయిలో కన్వీనర్‌, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్లను కాళోజీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు.

గత ఏడాది కంటే పోటీ పెరిగింది.. "ఈసారి నీట్‌ ప్రశ్నల్లో ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవడాన్ని ప్రతిభావంతులు బాగా వినియోగించుకున్నారు. గత ఏడాది 700 మార్కులొచ్చిన వారు 100 మందికి పైగా ఉండగా.. ఈసారి అవే మార్కులతో పోటీపడేవారు 100 మంది లోపే ఉన్నారు. గత ఏడాది 685 మార్కులకు 700వ ర్యాంకు రాగా.. ఈసారి 675 మార్కులకు అఖిలభారత ర్యాంకు 1000 లోపు ఉంది. దీన్ని బట్టి టాపర్స్‌లో పోటీ కొద్దిగా తగ్గిందని అర్థమవుతోంది. 625 మార్కులకు 10 వేల లోపు ర్యాంకు వచ్చింది. మొత్తంగా చూస్తే పోటీ ఎక్కువగానే ఉంది. ఈసారి అఖిలభారత స్థాయిలో తెలుగు విద్యార్థులు బాగా సీట్లు పొందే అవకాశం ఉంది. 640 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ఈ సీట్లు దక్కే అవకాశముంది. ఎయిమ్స్‌, జిప్‌మర్‌, ఏఎఫ్‌ఎంసీల్లో సీట్లు పొందే తెలుగు విద్యార్థుల సంఖ్య పెరగనుంది. టాప్‌ 100లో తెలుగు విద్యార్థులు సుమారు 25 మంది ఉన్నారు. గత ఏడాది ఈ సంఖ్య 20 మాత్రమే. ఎక్కువమందికి అఖిలభారత సీట్లు వచ్చే వీలున్నందున.. లక్ష వరకు ర్యాంకు వచ్చిన వారికి కూడా రాష్ట్రస్థాయి కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చే అవకాశాలుంటాయి." - పి.శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్య విద్యాసంస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.